సూర్యాపేటలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీకి జనసేన సంపూర్ణ మద్ధతు ఇస్తోందని తెలిపారు.
జనసేన పార్టీ పెట్టడానికి నల్గొండ జిల్లా మూల కారణమని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ చూసి చలించిపోయానన్నారు.
నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ పోరాటం జరిగిందని తెలిపారు.ప్రధాని మోదీ అన్ని కులాలు, మతాలను సమానంగా చూస్తారన్నారు.
ఈ క్రమంలోనే తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని ఆశాభావం వ్యక్తం చేశారు.తెలంగాణ యువత పోరాటమే తనకు స్ఫూర్తి అని తెలిపారు.