సూర్యాపేట జిల్లా: గరిడేపల్లి మండలం పోనుగోడు గ్రామ శివారులో టివిఎస్ బైక్ ను తప్పించబోయి ఓ కారు ఎన్.ఎస్.పి కాల్వలోకి దూసుకెళ్ళింది.ప్రమాద సమయంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలు,ఓ వ్యక్తి సురక్షితంగా బయట పడడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.
టివిఎస్ పై ప్రయాణిస్తున్న వృద్ధుడికి గాయాలు కావడంతో 108 అంబులెన్స్ లో హాస్పిటల్ కు తరలించారు.