సూర్యాపేట జిల్లా: ఎవరికీ మేం తక్కువ కాదంటూ అందరిలాగా మేం కూడా పుట్టిన రోజు వేడుకలు చేసుకుంటాం అంటూ ఓ ఇద్దరు హిజ్రాలు తమ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు.సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని 4 వ వార్డ్ లింగమంతుల స్వామి ఆలయ పరిసర ప్రాంతాల్లో హిజ్రాలు పుట్టినరోజు వేడుకలను పండుగలా నిర్వహించుకున్నారు.
బుధవారం పట్టణానికి చెందిన హిజ్రాలు చాందిని,హాసినీలది పుట్టినరోజు ఓకే రోజు కావడంతో తమ తోటి హిజ్రాల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు చేసుకున్నారు.డీజే డాన్స్ లతో అంగరంగ వైభవంగా సంబరాలు చేసుకోవడం చూపరులను ఆకట్టుకుంది.
బాటసారులు చూసి సంతోషించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా పుట్టుకే మా అదృష్టమని,మేం ఎవ్వరికీ తక్కువ కాదన్నారు.
మాలో చాలా మంది చదువుకుంటున్నారని,ఇప్పటికే కొందరు ఉన్నత స్థాయిలో ఉద్యోగాలు సాధించారంటూ గుర్తు చేశారు.ఈ సందర్భంగా కొంతమంది బాటసారులను పిలిచి భోజనాలు పెట్టారు.
ప్రతి ఒక్కరూ వారిని ప్రేమగా ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో శ్రీలేఖ, జెస్సి,శ్వేతా,రవళి,సాక్షి,వెన్నెల తదితరులు పాల్గొన్నారు.