గురప్పవాగు ఘటనకు పూర్తి బాధ్యత స్థానిక ఎమ్మెల్యేదే

సూర్యాపేట జిల్లా:శనివారం తాడువాయి గురప్ప వాగులో గల్లంతైన షేక్ సైదా మరణానికి స్థానిక ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ నైతిక బాధ్యత వహించాలని మునగాల ఎంపీపీ యలక బిందు నరేందర్ రెడ్డి,వైస్ ఎంపీపీ బుచ్చిపాపయ్య అన్నారు.ఆదివారం స్థానిక ఎంపీపీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడుతూ గత నాలుగేళ్ళ నుండి ప్రమాదకరంగా మారిన తాడువాయి,గణపవరం వాగులపై బ్రిడ్జీ నిర్మాణం చేయాలని ఎన్నిసార్లు ప్రతిపాదనలు పంపినా పట్టించుకోలేదని ఆరోపించారు.

 The Local Mla Is Fully Responsible For The Gurappawagu Incident-TeluguStop.com

స్థానిక ఎమ్మెల్యే,అధికారు లఅలసత్వం కారణంగానే ఈ రోజు గురప్ప వాగులో ఇద్దరు ఆడపిల్లల తండ్రి ప్రాణం పోయిందన్నారు.వాగులో గల్లంతైన షేక్ సైదా కుటుంబానికి ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా చెల్లించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

కేవలం మునగాల మండల పరిషత్ కాంగ్రేస్ కైవసం చేసుకుందనే రాజకీయ స్వార్థంతోనే మునగాల మండల అభివృద్ధిపై ఎమ్మెల్యే సీతకన్నేశారని విమర్శించారు.మండల ప్రజల ఓట్లతో గెలిచి అభివృద్ధిని విస్మరించడం తగదని హితవు పలికారు.

ఇప్పటికైనా జిల్లా ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు స్పందించి తక్షణమే తాడువాయి, గణపవరం వాగులపై బ్రిడ్జీ నిర్మాణాలు చేపట్టాలని డిమాండ్ చేశారు.లేనియెడల ఆయా గ్రామాల ప్రజలు,రైతులతో కలసి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube