అమిత్ షా షో అట్టర్ ప్లాప్

సూర్యాపేట జిల్లా:మునుగోడు బహిరంగ సభలో అమిత్ షా బండి సంజయ్ పాత్ర పోషించారని రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి జగదీష్ సెటైర్లు వేశారు.అవే అబద్ధాలు అవే అర్థం లేని మాటలు,ఆధారంలేని ఆరోపణలు చేశారని,దీని కోసం బండి సంజయ్ ఉండగా కేంద్ర మంత్రి అమిత్ షా రావాలా అని ఎద్దేవా చేశారు.

 Amit Shah's Show Is An Utter Flop-TeluguStop.com

సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆదివారం విలేకర్లతో మాట్లాడుతూ అమిత్ షా ప్రసంగంపై వ్యగ్యాస్త్రాలు సంధించారు.కెసిఆర్ పై అక్కసు తప్ప ఆయన మాటల్లో ఏమీ లేదని,నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు సమాధానమే లేదని, సమాధానం ఉండవనే విషయం కూడా మాకు తెలుసని అన్నారు.

బిజెపి అధినాయకుడే కెసిఆర్ కు సమాధానం చెప్పే పరిస్థితిలో లేడని,ఉన్న విషయాన్ని ఒప్పుకునే ధైర్యం బిజెపికి లేదని అన్నారు.ఆరు సంవత్సరాల కాలంలో మునుగోడులో ఫ్లోరిన్ భూతాన్ని అంతమొందించింది కేసీఆర్ అని, అమిత్ షా మాటలు దిగజారుడుతనం తప్ప ఇంకోటి కనపడలేదని విమర్శించారు.

కేంద్ర హోం మంత్రి స్థాయిలో ఉండి ఆయన స్థాయికి తగ్గట్టుగా మాట్లాడలేదని,ఫక్తు రాజకీయాలు ఓట్లు సీట్లు అధికారం తప్ప వాళ్లకు ఇంకో యావలేదని దుయ్యబట్టారు.బిజెపి పార్టీకి మీటర్ పెట్టడమే తప్ప మ్యాటర్ తెలియదని,మునుగోడులో ప్రజలు బిజెపికి డిపాజిట్ లేకుండా చేస్తారని జోస్యం చెప్పారు.

అమిత్ షా మాటల్లో ఈ రాష్ట్రానికి గానీ,మునుగోడు ప్రజలకు గానీ,ఒరిగింది ఏమీ లేదని అన్నారు.ప్రజల మధ్య వైశ్యామ్యాలు పెంచడమే బిజెపి తత్వమని,తెలంగాణ రాష్ట్రంలో ఆ పప్పులు ఉడకవని తేల్చిచెప్పారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube