ఈ మధ్య కాలంలో నరసింహ రాజు గారి ఇంటర్వూస్ తరచుగా చూస్తున్నాం.అయన తన సొంత ఆస్తుల గురించి, కుటుంబం గురించి అనేక వివరాలు చెప్తున్నారు.
అయితే ఈయన తన కెరీర్ మొదలు పెట్టింది చెన్నై లోనే.అక్కడే హీరో గా నటించిన నరసింహ రాజు మంచి సినిమాల్లో నటించారు.
ఎక్కువగా విటలాచార్య సినిమాల్లో హీరో గా కనిపించిన ఈయన ఆ మధ్య కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్ కి మకాం మారడం తో ఎక్కువ సినిమాల్లో నటించలేకపోయారు.కుటుంబం అంత మద్రాసులోనే ఉన్నప్పటికీ అయన మాత్రం తనకు తొలినాళ్లలో అవకాశం ఇచ్చిన దాసరి గారు పిలవడం తో హైదరాబాద్ కి వచ్చారు.
ఆలా హైదరాబాద్ రాగానే ఎక్కడ ఉండాలో తెలియక నేరుగా దాసరి ఇంటికి వెళ్ళిపోతే అప్పటికే లాస్ లో ఉన్న జూబ్లీ చెక్ పోస్ట్ వద్ద ఉన్న బంగళాలో ఉండమని చెప్పారట.సినిమాల్లో వేషాలు దొరికితే చేసుకో లేదంటే ఆ బంగ్లా లావాదేవీలను చేసుకొమ్మని చెప్పారట, దాంతో ఆ బిజినెస్ ని అయన కొన్ని రోజుల్లోనే లాభాల బాట పాటించారట.
రోజుకు ఐదు వేల రూపాయల జీతం తీసుకొని ఆ బంగ్లాను ఒక రెస్టారెంట్ గా మార్చి మద్రాసు నుంచి సినిమా అవకాశాల కోసం వచ్చిన వారికి షెల్టర్ ఇస్తూ ఒక కాల్చలర్ హబ్ గా మార్చి దాన్ని బాగా డెవలప్ చేశారట.ఆలా ఆ ఆస్తిని కాపాడి దాసరి వేళల్లో డబ్బులు సంపాదించే వనరుగా మార్చరట.
ఆ తర్వాత తెలుగు లో సీరియల్స్ కూడా రావడం తో నరసింహ రాజు గారు బిజీ అయిపోయి బంగ్లా వ్యవహారాలను వేరే వాళ్లకు అప్పగించారట.ఆ లోగ తన పిల్లలు కూడా సెటిల్ అయిపోవడం తో భార్య తో సహా హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యారట.ఆ తర్వాత మద్రాసు కి హైదరాబాద్ కి షూటింగ్స్ కోసం తిరుగుతూ కాలక్షేపం చేస్తున్నారు.ఇక ఈ మధ్య ఆ షూట్స్ కూడా లేకపోవడం తో రిటైర్ అయిపోయి ఆరు నెలలు హైదరాబాద్ లో ఆరు నెలలు కొడుకు తో కెనడా లో ఉంటూ బాగా తన విశ్రాంత సమయాన్ని గడుపుతున్నారు.
ఇక తన మానవరాలిని సైతం హీరోయిన్ చేయాలనీ ఆకాక్షిస్తున్నారు నరసింహ రాజు గారు.