పేట ఐటీ హబ్, సమీకృత మార్కెట్, ట్యాంక్ బండ్ అవినీతిమయం:ధర్మార్జున్

సూర్యాపేట జిల్లా:గత ప్రభుత్వ హయాంలో సూర్యాపేట పట్టణంలో అభివృద్ది ముసుగులో జరిగిందంతా అవినీతేనని, సమీకృత మార్కెట్,ట్యాంక్ బండ్ సుందరీకరణ,ఐటీ హబ్ పేరుతో జరిగిన అవినీతి,ప్రజాధనం దుర్వినియోగంపై న్యాయ విచారణ జరిపించాలని తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యాపేట నియోజకవర్గ ఇంఛార్జి ధర్మార్జున్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.కేవలం ఎన్నికల్లో ప్రజలను ప్రధానంగా యువతను ఐటీ హబ్ పేరుతో మోసం చేశారని విమర్శించారు.

 Peta It Hub, Integrated Market, Tank Bund Corrupt Dharmarjun , Tank Bund Corrupt-TeluguStop.com

స్ధానిక శాసనసభ్యుడు,మాజీ మంత్రి మున్సిపల్ కమిషనర్,ఇతర అధికారులు కుమ్మక్కై అటు ప్రభుత్వ నిధులు, ఇటు పట్టణ ప్రజల పన్నులను అక్రమంగా దండుకొన్నారని ఆరోపించారు.ట్యాంక్ బండ్ సుందరీకరణ,సద్దల చెర్వులో బోటు నిర్వహణకు టెండర్ల కేటాయింపులు,ఏ ఫండ్ నుండి నిధులు కేటాయించారని సమాచార హక్కు చట్టం కింద మున్సిపల్ కమీషనర్ కు దరఖాస్తు చేసినా స్పందన లేదన్నారు.

ఈ విషయమై అప్పీలేట్ అధికారికి ఫిర్యాదు చేయబోతున్నట్లు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube