కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల డ్రామాల మధ్య నలిగిపోతున్న అన్నదాత:పోకల వెంకటేశ్వర్లు

సూర్యాపేట జిల్లా:రోజుకో ధరతో ధాన్యం కొనుగోలు చేస్తూ రైతులను నిలువు దోపిడీ చేస్తున్న రైస్ మిల్లుల యాజమాన్యంపై,మధ్యదళారీలపై చర్యలు తీసుకొని, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకోవాలని సీపీఐ గరిడేపల్లి మండల కార్యదర్శి పోకల వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.శనివారం మండల కేంద్రంలో విలేకర్లతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో రైతే ఈ దేశానికి వెన్నెముక,రైతు లేనిదే రాజ్యం లేదని సొల్లు కబుర్లు చెప్పి,ఓట్లు వేయించుకొని గెలిచిన తర్వాత అందరికీ అన్నం పెట్టే అన్నదాతలను మోసం చేయటం పరిపాటిగా మారిందని మండిపడ్డారు.

 Annadata Torn Between The Dramas Of The Central And State Governments: Pokala Ve-TeluguStop.com

రాష్టంలో అధికారంలో వున్న టీఆర్ఎస్ కానీ,కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ కానీ,కేవలం తమ రాజకీయ ప్రయోజనాలు ఆశించి మాత్రమే పనిచేస్తున్నాయి తప్ప రైతుల కష్టాలను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.నిన్నటి వరకు టీఆర్ఎస్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి బీ టీమ్ గా వ్యవహారిస్తూ పార్లమెంట్ లో అన్ని విధాలుగా సహకరించి,నేడు రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఇద్దరికి పడనట్లుగా నటిస్తూ ప్రజలను గందరగోళపరుస్తున్నారని విమర్శించారు.

ధాన్యం ప్రారంభంలో ఒక ధర ఉంటే,మధ్యలో మరొక ధర,చివరికి ఇంకొక ధరతో కొనుగోలు చేస్తూ, మిల్లర్లు,మధ్య దళారీలు ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతులను దోపిడీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఇంత దారుణంగా రైతు మోసానికి గురైతుంటే అధికారంలో వున్న పార్టీలు కానీ, పజాప్రతినిధులు కానీ,ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు.

రైతు మోసపోవడం ఇప్పుడే కాదని,ప్రతి యేటా ఇదే విధంగా రైతును దోపిడీ చేస్తూనే వున్నారని,అయినా ఎవరికీ పట్టదన్నారు.ప్రతీ ఏటా బియ్యం ధర మాత్రం పెరుగుతుంది కానీ,వడ్ల ధర మాత్రం తగ్గుతుందని,రైతు తాను ఉత్పత్తి చేసే పంటకు ధరను నిర్ణయించుకొనే స్వేచ్ఛ లేకపోవడమే దీనికి కారణమని,వ్యాపారుల మాదిరిగా రైతులకు కూడా తాను పండించే పంటకు ధరను నిర్ణయించుకోనే రోజు రావాలని అన్నారు.

టీఆర్ఎస్,బీజేపీ పార్టీలు ఆడుతున్న నాటకానికి తెరపడాలంటే,రైతులలో చైతన్యం రావాలని,ప్రశ్నించే తాత్వాన్ని పెంచుకోవాలని,దోపిడీ శక్తులపై తిరుగుబాటు చేయాలని,ప్రజాప్రతినిధులను ఎక్కడికక్కడ నిలదీయాలని పిలుపునిచ్చారు.రైతులను దోపిడీ చేస్తున్న మిల్లర్లు,మధ్య దళారీలపై పీడీ యాక్ట్ కేసులను నమోదు చేసి జైళ్లకు పంపి, ప్రభుత్వాలు తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు.

చిన్న చిన్న దొంగతనాలకే జైలుకు పంపే మన చట్టాలు,ఇంత పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్న కూడా వారిపై ఏ చర్యలు తీసుకోకపోవడానికి పాలక పక్షాలు కారణం కాదా? అని ప్రశ్నించారు.రైతాంగం ఇప్పటికైనా మేల్కొని,ఢిల్లీ రైతుల పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని సంఘటితంగా పోరాడి,మధ్య దళారీలకు,మిలర్లకు వారికి సహకరిస్తున్న పాలక పక్షాలకు బుద్ది చెప్పాలని సూచించారు.

అధికారులను ఇప్పుడు ఏమనే పరిస్థితి లేదని,కారణం వారు ప్రజాప్రతినిధులు ఏమీ చెపితే అదే చేసే పరిస్థితి ఉందని,ఇది అందరికీ తెలిసిందేనని,ప్రజాస్వామ్యం ఈ విధంగా ప్రజాప్రతినిధుల చేతిలో కీలు బొమ్మగా తయారయిందని,అందుకే అధికారులను ఏమీ అనేటట్లు లేదని ఎద్దేవా చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube