సూర్యాపేట జిల్లా:చిలుకూరు మండల కేంద్రంలోని అభయాంజనేయ స్వామి ఆలయ సమీపంలో ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీ కొట్టడంతో ద్విచక్ర వాహనంపై వెళుతున్న భార్యభర్తల్లో భార్య అక్కడికక్కడే మృతి చెందగా భర్తకు తీవ్ర గాయాలయ్యాయి.ఈ ప్రమాదంలో మృతి చెందిన మృతురాలు కోదాడ మండలం ద్వారకుంట గ్రామానికి చెందిన దొంగరి శ్రీదేవి భర్త పేరు రమేష్ గా గుర్తించారు.
గాయపడిన భర్త రమేష్ ను హుటాహుటిన కోదాడ ఆసుపత్రికి తరలించారు.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.