సూర్యాపేట జిల్లా:ఆదివారం అర్థరాత్రి ప్రారంభమై ఐదు రోజుల పాటు జరిగే తెలంగాణ రాష్ట్రలోని రెండవ అతిపెద్ద జాతర అయిన సూర్యాపేట జిల్లా చివ్వేంల మండలం దురాజ్ పల్లి శ్రీ శ్రీ శ్రీ లింగమంతుల స్వామి (పెద్దగట్టు) జాతరను సోమవారం రాష్ట్ర భారీ నీటి పారుదల మరియు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దర్శించుకున్నారు.
అనంతరం దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్,టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి స్వాగతం పలికారు.శ్రీ లింగమంతుల స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి సూర్యాపేట నియోజకవర్గ,రాష్ట్ర ప్రజలు పాడిపంటలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనసారా కోరుకున్నట్లు తెలిపారు.