ఇన్‌స్టాగ్రామ్‌లో అదిరిపోయే 5 కొత్త ఫీచర్లు ఇవే.. ఎలా యూజ్ అవుతాయంటే..?

ప్రముఖ ఫొటో, వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో యూజర్లను బాగా ఆకట్టుకుంటోంది.ఇందులో భాగంగా తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ 5 కొత్త ఫీచర్లను ఇంట్రడ్యూస్ చేసింది.

 Instagram Brings Five New Features For Its Users Details, Instagram, New Featur-TeluguStop.com

ఈ న్యూ ఫీచర్స్ చాలా ఉపయోగకరంగా ఉండనున్నాయి.ఇందులో ఇన్‌బాక్స్‌లోకి వెళ్లకుండానే మెసేజ్ పంపే ఇన్‌స్టాంట్ రిప్లై నుంచి ఫ్రెండ్స్ ఆన్ లైన్ స్టేటస్ చూసే ఫీచర్లు వరకు ఉన్నాయి.ఇవి యూజర్లకు ఎలా యూజ్ అవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇన్‌స్టాంట్ రిప్లే

మొన్నటిదాకా ఇన్‌స్టాగ్రామ్‌లో ఏదైనా మెసేజ్ పంపించాలన్నా లేదా రిప్లై ఇవ్వాలన్నా ఇన్‌బాక్స్‌లోకి వెళ్లాల్సి వచ్చేది.లేదా ఫలానా ఐడీని సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చేది.కానీ ఇప్పుడు మేసెజ్ వస్తే.ఇన్‌బాక్స్‌లోకి వెళ్లాల్సిన అవసరం ఉండదు.ఈ ఫీచర్‌తో ఫీడ్ బ్రౌజ్ చేస్తూనే రిప్లై ఈజీగా ఇవ్వడం సాధ్యం అవుతుంది.

Telugu Create, Instant Reply, Instgram, Latest, Status, Send-Latest News - Telug

క్విక్ సెండ్

ఏదైనా ఇంట్రెస్టింగ్ ఫొటో లేదా వీడియోని ఫ్రెండ్స్‌కు పంపాలనుకుంటే.మీరు క్విక్ సెండ్ ఫీచర్ తో ఫాస్ట్ గా సెండ్ చేసుకోవచ్చు.ఇందుకు మీరు ఏదైనా ఓ ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్ కింద షేర్ బటన్‌పై క్లిక్ చేసి హోల్డ్ చేస్తే సరిపోతుంది.

ఆన్‌లైన్‌ స్టేటస్

ఆన్‌లైన్‌లో ఎవరున్నారో తెలియజేసే ఫీచర్ ఇది.ఈ ఫీచర్ తో ఇన్‌స్టాగ్రామ్‌ యాప్ లోని ఇన్‌బాక్స్ టాప్‌లో మీరు ఆన్‌లైన్‌లో ఏయే ఫ్రెండ్స్ ఉన్నారో తెలుసుకోవచ్చు.

Telugu Create, Instant Reply, Instgram, Latest, Status, Send-Latest News - Telug

సైలెంట్ గా సెండ్ చేసే మెసేజ్ ఫీచర్

మెసేజ్ నోటిఫికేషన్ పంపకుండా ఫ్రెండ్స్‌కు మెసేజ్ పంపించేందుకు ఈ ఫీచర్ బాగా యూజ్ అవుతుంది.ఫ్రెండ్స్ కి నైట్ టైమ్ లో లేదా బిజీ టైమ్స్ లో ఈ ఫీచర్ హ్యాండీగా నిలుస్తుంది.

క్రియేట్ పోల్

గ్రూప్ చాట్‌లో పోల్ క్రియేట్ చేసేందుకు ఈ ఫీచర్ యూజ్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube