నేరేడుచర్లలో ఉద్రికత

సూర్యాపేట జిల్లా:నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని మిర్యాలగూడ,కోదాడ రహదారి వెడల్పులో భాగంగా రోడ్డుకిరువైపులా ఉన్న కట్టడాలను పోలీసుల పహారాలో ఉదయం ఆరు గంటలకే అధికారులు జేసీబీలతో కూల్చివేత కార్యక్రమం చేపట్టడంతో షాపులు కోల్పోతున్నవారు అడ్డుకునే ప్రయత్నం చేశారు.దీనితో అధికారులు,పోలీసులతో షాపుల యజమాన్యం వాగ్వాదానికి దిగడంతో కొద్దిసేపు ఉద్రికత చోటుచేసుకుంది.

 Tension In Nereduchar-TeluguStop.com

తమకు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా,ముందస్తు సమాచారం లేకుండా పోలీసుల పహారాలో ఇలా కట్టడాలు కూల్చివేయడం ఏమిటని ప్రశ్నించారు.ముందస్తు సమాచారం ఇస్తే షాపుల్లో సామాగ్రి తరలించే అవకాశం ఉండేదని,ఇప్పుడు ఉన్నఫలంగా కూల్చడం వల్ల సామగ్రి అంతా పనికి రాకుండా పోయిందని దీనివల్ల తీవ్ర నష్టం వాటిల్లుతుందని అసంతృప్తి వ్యక్తం చేశారు.

షాపుల యజమానుల కోరిక మేరకు దుకాణాలలో ఉన్న సామాగ్రీని తీసుకునేందుకు పోలీసులు కొద్దిసేపు సమయం ఇచ్చారు.అనంతరం పోలీసుల పహారాలో యధావిధిగా కూల్చితలు కొనసాగించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube