ఘనంగా యువనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు:డీసీసీ అధ్యక్షుడు

సూర్యాపేట జిల్లా: జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం యువనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను కేకు కటింగ్ చేసి మిఠాయిలు పంపిణీ చేసి బాణసంచా కాల్చి ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ మాట్లాడుతూ 2004,2009 రెండు పర్యాయాలు ప్రధాని పదవిని త్యాగం చేసిన ఘనత రాహుల్ గాంధీకి దక్కుతుందన్నారు.

 Grand Birthday Celebrations Of Youth Leader Rahul Gandhi Dcc President Cheviti V-TeluguStop.com

దేశంలో ఏ నాయకుడు చేయని విధంగా దేశ వ్యాప్తంగా ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు భారత్ జోడో యాత్ర పేరుతో పాదయాత్ర చేసిన ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ మాత్రమేనన్నారు.భారత దేశ ప్రజలను ఏకం చేయడం వారి సమస్యలను వినడం లక్ష్యంగా పెట్టుకొని యాత్రను విజయవంతం చేసుకుని,కోట్ల మంది గుండెల్లో ధైర్యం అనే జెండాను నాటి అండగా నిలుస్తున్న భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు,

యువకిశోరుడు,రాహుల్ గాంధీ ఈ దేశంలోని చదువుకున్న నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగం మరియు రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడమే కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యమని తెలిపారు.

పిసిసి అధికార ప్రతినిధి చకిలం రాజేశ్వరరావు,పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అంజద్ అలి,వర్కింగ్ ప్రెసిడెంట్ చెంచల శ్రీనివాస్,మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరెని శ్రీనివాస్, పిసిసి ఎస్సి సెల్ వైస్ చైర్మన్ చింతమళ్ల రమేష్, ఆత్మకూర్ (ఎస్) మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కందాల వెంకట్ రెడ్డి,జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి పిడమర్తి మల్లయ్య,చెరుకు రాము, అధికార ప్రతినిధి కుందమల్ల శేఖర్,బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు తంగేళ్ళ కరుణాకర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ సేవాదల్ చీఫ్ ఆలేటి మాణిక్యం జిల్లా కాంగ్రెస్ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ యలగందుల సాయినేత తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube