రాజ్యాంగం రద్దుకు బీజేపీ కుట్రలు

సూర్యాపేట జిల్లా:కేంద్ర బీజేపీ సర్కార్ రాజ్యాంగం రద్దుకు కుట్రలు చేస్తుందని రాజ్యాంగ రక్షణకు భారతీయులు ఐక్యం కావాలని,దేశాన్ని రక్షించి, బీజేపీ విధానాలను ప్రతిఘటించడానికి యువతరం సిద్ధం కావాలని కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్ బాబు పిలుపునిచ్చారు.

 Bjp Conspiracies To Abrogate The Constitution-TeluguStop.com

బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సూర్యాపేట ఫంక్షన్ హాల్ లో కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు మర్రి నాగేశ్వరరావు,నాయకులు పిండిగ నాగమణి అధ్యక్షతన జరిగిన కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) జిల్లా ద్వితీయ మహాసభలకు ఆయన ముఖ్యాతిథిగా హాజరై మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చాక ఎస్సి,ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం రద్దు చేసి దళితులకు అడుగడుగునా అన్యాయం చేసిందన్నారు.బీజేపీ అధికారంలోకి వచ్చాక దళితులు,మహిళలపై దాడులు పెరిగాయన్నారు.

ప్రభుత్వ రంగ సంస్థలను నడిబజార్లో అమ్ముతూ దేశభక్తి ముసుగులో దేశద్రోహానికి పాల్పడుతుందన్నారు.రాజ్యాంగం రద్దు కోసం కుట్రలు చేస్తుందని ఆరోపించారు.

రాజ్యాంగ రక్షణ కోసం రాజకీయాలకతీతంగా ఐక్యం కావాలని పిలుపునిచ్చారు సీఎం కేసీఆర్‌ పాలనలో దళితుల వాగ్దానాలు అమలుకాలేదన్నారు.ముఖ్యమంత్రి పదవి,మూడెకరాల భూమి,డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో అన్యాయం జరిగిందన్నారు.

ఈ మహాసభల్లో సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నెమ్మాది వెంకటేశ్వర్లు,కొలిశెట్టి యాదగిరి రావు,వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కౌన్సిల్ సభ్యులు ములకలపల్లి రాములు,పట్నం జిల్లా కన్వీనర్ జె.నర్సింహారావు,వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కొదమగుండ్ల నగేష్,సిఐటియు జిల్లా నాయకులు మామిడి సుందరయ్య,కెవిపిఎస్ జిల్లా నాయకులు మీసాల వీరబాబు,దేవరకొండ యాదగిరి,బోయిళ్ళ అర్జున్,టేకుల సుధాకర్, నందిగామ సైదులు,దుర్గారావు,ఇరుగు రమణ, భాగ్యమ్మ,అబ్రహం,శ్రీను,కృష్ణ,నాగయ్య,దేవిక తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube