సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలోని పబ్లిక్ క్లబ్ కు ఆదివారం నిర్వహించిన నూతన కమిటీ ఎన్నిక ప్రజాస్వామికమని సూర్యాపేట జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు 37 వ వార్డు కౌన్సిలర్ పబ్లిక్ క్లబ్ సభ్యులు బై రూ శైలేందర్ గౌడ్ అన్నారు.ఆదివారం సాయంత్రం పబ్లిక్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పబ్లిక్ క్లబ్ ఎన్నిక జరగాలంటే పదిహేను రోజుల ముందు ఆర్డిఓ నోటీస్ బోర్డ్ లో ఎన్నిక నిర్వహిస్తున్నట్టు తెలపాలని కానీ, అది చేయకుండా గుట్టుచప్పుడుగా అధికార పార్టీకి అనుకూలంగా రాత్రికి రాత్రే నిర్ణయం తీసుకొని ఆదివారం ఉదయం ఎన్నికలు నిర్వహించడం ఎంతవరకు సబబని అధికారులను ప్రశ్నించారు.
ఉదయం పేపర్ చదవడానికి క్లబ్ కు రాగా ఎన్నిక విషయం తెలిసిందని తెలిపారు.పబ్లిక్ క్లబ్ కమిటీ ఎన్నికలాగా లేదని,టిఆర్ఎస్ కమిటీ ఎన్నిక మాదిరిగా ఉందని ఎద్దేవా చేశారు.
ఎన్నికపై తాను అడుగగా టిఆర్ఎస్ నాయకుడు మమ్మల్ని అసభ్య పదజాలంతో అవమానకరంగా మాట్లాడని వాపోయారు.దీనిపై త్వరలో జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేయనున్నట్లు న్యాయం కొరకు కోర్టుకు కూడ వెళ్ళనున్నట్లు తెలిపారు.
గత 3 సంవత్సరాలుగా క్లబ్ ఆదాయం, లెక్కలు,ఖర్చులు చూపించాలని,సూర్యాపేట పబ్లిక్ క్లబ్ సభ్యులు మొత్తం 706 మంది ఉన్నారని,కనీసం 100 మంది సభ్యులకు కూడా సమాచారం లేకుండా ఎన్నిక నిర్వహించారని,సభ్యులకు కనీస సౌకర్యాలు కల్పించాలని ఇదే ఎన్నిక నిర్వహించిన ఆర్డీఓని పలు దఫాలు కలిసింది నిజం కాదా అని ప్రశ్నించారు.నాడు నిజాం క్లబ్ క్లబ్ గా ఉన్న సూర్యాపేట పబ్లిక్ క్లబ్ నేడు ఆంధ్ర వలసవాదుల కబంధ హస్తాలలోకి వెళ్లిందని వాపోయారు.
ఆర్డిఓ తక్షణమే స్పందించి ఈ కమిటీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.లేనిపక్షంలో సూర్యాపేట వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు,ధర్నాలు,ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు హెచ్చరించారు.
ఈ సమావేశంలో పబ్లిక్ క్లబ్ సీనియర్ సభ్యులు అంజద్ అలీ కక్కిరేణి శ్రీనివాస్,రుద్రంగి రవి,మద్ది శ్రీనివాస్ యాదవ్, రావుల రాంబాబు,పిండిగ విజయ్ కుమార్, సాయినేత,గోలి రామ్ రెడ్డి,పగిడిమర్రి నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.