ఇచ్చిన హామీలను నెరవేర్చి రాబోయే ఎన్నికల్లో ఓట్లు అడగాలి:యుగంధర్

యాదాద్రి భువనగిరి జిల్లా:గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చి, రానున్న ఎన్నికల్లో ఓట్లు అడగాలని తెలంగాణ స్టూడెంట్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడు, అడ్వకేట్ పర్రెపాటి యుగేందర్ రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్ విసిరారు.

మోత్కూరు మండల కేంద్రంలో శుక్రవారం ఆయన ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు.

మంత్రి జగదీష్ రెడ్డి,ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ రాజకీయాలను పక్కనపెట్టి అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు.గత ఎన్నికల్లో మోత్కూర్ మండలానికి డిగ్రీ కళాశాల, తిరుమలగిరి మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల హామీలు అలాగే మిగిలాయన్నారు.

మండల పరిసర ప్రాంతాల ప్రజలు దశాబ్దాల నుండి చదువు కోసం ఇబ్బందులు పడుతున్నారన్నారు.తిరుమలగిరి ధాన్యం కుంభకోణం విషయంలో నేటికీ దోషులను పట్టుకోలేదని ఎద్దేవా చేశారు.

మున్సిపల్ కేంద్రంలో కుంట శిఖమని చెబుతూ అంబేద్కర్ భవన నిర్మాణం కోసం నేటికీ పునాది రాయి వేయలేదని,అదే సర్వే నెంబర్ లో సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసు నిర్మాణానికి అడ్డురాని కుంట శిఖం అంబేద్కర్ భవన నిర్మాణానికి ఎలా అడ్డు వచ్చిందో చెప్పాలని మంత్రి జగదీశ్ రెడ్డి,ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ లను ప్రశ్నించారు.మోత్కూరు- గుండాల మండలాన్ని కలిపే బ్రిడ్జ్ నిర్మాణం కోసం ప్రభుత్వానికి ఎన్ని వినతులు వచ్చినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

Advertisement

అడ్డగూడూరు మండలంలో అంబేద్కర్ భవన నిర్మాణంలో కారణం లేని జాప్యం చేస్తున్నారన్నారు.నియోజకవర్గ సమస్యలు పక్కనపెట్టి అక్రమ ఇసుక రవాణాతో కోట్లు కూడా పెట్టుకుంటున్న మంత్రి, ఎమ్మెల్యే రానున్న ఎన్నికల్లో మూల్యం చెల్లించుకోవడం తప్పదన్నారు.

ప్రజల సమస్యలను పక్కనపెట్టి రైతుబంధు సాకుతో ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ వ్యక్తిగత భజన కోసం వాడుకుంటున్నారని ఈ విషయాన్ని దళిత సోదరులు గమనించాలన్నారు.ఎమ్మెల్యే మాటలతో కోటలు కడితే తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరని రానున్న ఎన్నికల్లో మిమ్మల్ని ఓడించడానికి ప్రజలు నిర్ణయించుకున్నారని, ఎన్ని రాజకీయ కవ్వింపులు చర్యలు చేసినా ఆయన ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు.

Advertisement

Latest Suryapet News