తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ను సంపాదించుకున్న నటుడు రానా( Rana ) ఇక ఈయన శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లీడర్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు.అయితే ఈయన చేసిన ప్రతి సినిమాలో వైవిధ్యన్నైతే కనబరుస్తూ నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తూ ఉంటాడు.
ఇక బాహుబలి సినిమాతో స్టార్ గా గుర్తింపు అయితే పొందాడు.అయితే ఈ సినిమాలో ప్రభాస్( Prabhas ) హీరో పాత్రను పోషించినప్పటికి రానా కూడా తనతో పాటు గుర్తింపును కూడా సంపాదించుకున్నాడు.
ఎందుకంటే విలనిజాన్ని పండించడంలో అత్యున్నతమైన వైవిధ్యాన్ని ప్రదర్శించాడు.కాబట్టే ఆయన ఇండస్ట్రీలో విలక్షణమైన నటుడిగా కొనసాగుతున్నాడు.ఇక ఇదిలా ఉంటే ప్రభాస్ హీరోగా వస్తున్న కల్కి సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలైతే ఉన్నాయి.అయితే వాళ్ళ అంచనాలకు తగ్గట్టుగానే నాగ్ అశ్విన్ ( Nag Ashwin )ఈ సినిమా మీద భారీ ఎఫర్ట్ అయితే పెడుతున్నాడు.
ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా రానా కల్కి సినిమాలో వాయిస్ ఓవర్ ఇస్తున్నాడని తెలుస్తుంది.దానికి సంబంధించిన డబ్బింగ్ పూర్తి చేసుకున్న రానా ఈ సినిమా గురించి స్పందిస్తూ ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది అనే హింట్ కూడా ఇచ్చాడు.
ఇక దాంతో రానా ఎంట్రీతో కల్కి సినిమా ( Kalki movie )మరింత గ్రౌండ్ గా మారిందనే చెప్పాలి.
కాబట్టి ఈ సినిమాతో ఎలాగైనా సక్సెస్ కొట్టాలని నాగశ్విన్ చాలా తీవ్రమైన కసరత్తులను చేస్తున్నాడు.ఇక ఈ సినిమా జూన్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టుగా తెలుస్తోంది.చూడాలి మరి ఈ సినిమాతో తను ఎలాంటి సక్సెస్ ని తన ఖాతాలో వేసుకుంటాడు అనేది… ఇక రానా కూడా ఈ సినిమాలో భాగమవడం చూసిన ప్రభాస్ అభిమానులు రానాకి కూడా థాంక్స్ చెబుతూ సోషల్ మీడియాలో ఆయన చెప్పిన మాటల్ని వైరల్ చేస్తున్నారు…
.