తమిళ దర్శకులు మన దర్శకుల కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారా..?

Are Tamil Directors Getting More Remuneration Than Our Directors , Lokesh Kanaka Raj, Mani Ratnam, Kamal Haasan , Indian 2, Ponniin Selvan Part 2

సౌత్ సినిమా ఇండస్ట్రీ లో తమిళ్ ఇండస్ట్రీ కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఎందుకంటే వాళ్ళు చేసే సినిమాల్లో కూడా మంచి కంటెంట్ ఉంటుంది… అయితే తమిళ్ ఇండస్ట్రీ పాన్ ఇండియా రేంజ్ కి వెళ్ళడం లో కృషి చేసిన కొంత మంది డైరెక్టర్లు ఎవరు… వాళ్ళు ఒక్క సినిమా కి తీసుకునే రెమ్యూనరేషన్ ఎంత అనేది ఒకసారి తెలుసుకుందాం.ఈ లిస్ట్ లో మొదట గా వినిపించే పేరు శంకర్( Shankar ) ఈయన చేసిన సినిమాలు తమిళ్ లోనే కాకుండా తెలుగు లో కూడా సూపర్ హిట్ అయ్యాయి.

 Are Tamil Directors Getting More Remuneration Than Our Directors , Lokesh Kanaka-TeluguStop.com

శంకర్ ఇప్పుడు బిజీగా వున్నారు.కమల్‌హాసన్ ( Kamal Haasan )తో ఇండియన్‌ 2 సినిమా చేస్తున్నాడు.

రామ్ చరణ్ తో ఒక మూవీ చేస్తున్నాడు.ఒక్కో సినిమాకు 75 కోట్లు తీసుకుంటున్నాడు.

రీసెంట్ గా కమల్ హాసన్ తో విక్రమ్ సినిమా తీసి భారీ హిట్ కొట్టిన లోకేష్ కనక రాజ్( Lokesh Kanaka Raj ) గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన పని లేదు ఎందుకంటే ఆయన టాలెంట్ ఏంటి అనేది తమిళ్ తో పాటు తెలుగులోనూ నిరూపించుకున్నాడు.అయితే ఈయన ప్రస్తుతం ఒక్క సినిమాకి 55 కోట్ల రూపాయల వరకు తీసుకుంటున్నాడట.

ఖైదీ, విక్రమ్ వంటి సూపర్ మూవీస్ ని తీశాడు.

Telugu Indian, Kamal Haasan, Mani Ratnam, Ponniin Selvan-Telugu Stop Exclusive T

మణిరత్నం( Mani Ratnam ) ఒకప్పుడు ఇండస్ట్రీ హిట్ సినిమాలు తీశాడు.ప్రస్తుతం పొన్నియన్ సెల్వం తో మంచి హిట్ కొట్టి మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు…దాంతో మణిరత్నం ఒక్కో సినిమాకు దాదాపు 40 కోట్ల వరకు తీసుకుంటున్నాడట.పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 2 షూటింగ్‌లో ప్రస్తుతం బిజీగా వున్నాడు.

శివ గురించి మన అందరికీ తెలుసు తెలుగు లో గోపిచంద్ తో శౌర్యం,శంఖం లాంటి సినిమాలు తీశారు.ఇక తమిళంలో వీరం, వివేగం, విశ్వాసం వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఈయన దాదాపు 30 కోట్ల రూపాయలని ఒక్కో సినిమాకి తీసుకుంటున్నాడట.ఇక చివరగా వెట్రి మారన్ గురించి చెప్పాలి.

ఈయన చేసిన చాలా సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి అందులో ధనుష్ తో చేసిన సినిమాలు అయితే ఈయనకి డైరెక్టర్ గా మంచి పేరు తీసుకువచ్చాయి… ఈ డైరెక్టర్ విషయానికి వస్తే దాదాపు 30 కోట్ల రూపాయలు ఒక్కో సినిమా కి తీసుకుంటున్నాడట ప్రస్తుతం తెలుగులో ఎన్టీయార్ తో సినిమా చేయాలని చూస్తున్నాడు…

.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube