ప్రస్తుత వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు భరించలేని స్థాయికి పెరిగిపోతున్నాయి.సమ్మర్ సీజన్ లో మన శరీర ఉష్ణోగ్రత పెరగడం అనేది సర్వసాధారణం.
దీనినే హైపర్‌థెర్మియా( Hyperthermia ) అంటారు.సూర్యరశ్మికి గురికావడం, వేడి వాతావరణం, డీహైడ్రేషన్ కారణంగా హైపర్థెర్మియా సంభవిస్తుంది.
దీని వల్ల తలనొప్పి, కళ్లు తిరగడం, గుండె కొట్టుకునే వేగం పెరగడం, వికారం, గందరగోళం తదితర సమస్యలు తలెత్తుతాయి.వీటికి చెక్ పెట్టి శరీర ఉష్ణోగ్రతను అదుపులోకి తెచ్చుకోవాలంటే కచ్చితంగా కొన్ని చర్యలు చేపట్టాలి.
ఈ నేపథ్యంలోనే సమ్మర్ లో బాడీ హీట్ ను మాయం చేసే టాప్ అండ్ బెస్ట్ ఫుడ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పుచ్చకాయ( watermelon ) సమ్మర్ సీజన్ లో తినదగ్గ పర్ఫెక్ట్ ఫ్రూట్.
దాదాపు 90% నీటితో లోడ్ చేయబడిన పుచ్చకాయ శరీరాన్ని చల్లగా మారుస్తుంది.డీహైడ్రేషన్( Dehydration ) సమస్యను తరిమి తరిమి కొడుతుంది.
అలాగే కీర దోసకాయ( Cucumber ) శరీరాన్ని తక్షణమే హైడ్రేట్ చేస్తుంది.మరియు శరీరంలోని వేడిని తగ్గిస్తుంది.
కాబట్టి వేసవిలో రోజుకు ఒక కీర దోసకాయను సలాడ్ లేదా జ్యూస్ రూపంలో తీసుకోండి.

ఈ వేసవిలో మీ డైట్‌లో చేర్చుకునే ఉత్తమమైన పాల ఉత్పత్తులలో పెరుగు ఒకటి.శరీరాన్ని చల్లబరచడానికి పెరుగు ఉత్తమంగా సహాయపడుతుంది.శరీర వేడిని దూరం చేయగలిగే సత్తా కొబ్బరి నీళ్లకు కూడా ఉంది.
వేసవిలో రోజుకు ఒక గ్లాస్ కొబ్బరి నీళ్లు( Glass of coconut water ) తాగారంటే మీకు తిరుగే ఉండదు.అలాగే ఉల్లిపాయలు ఘాటుగా ఉన్నా కూడా బాడీని కూల్‌గా మార్చే లక్షణాలను కలిగి ఉంటాయి.
పెరుగన్నంలో పచ్చి ఉల్లిపాయ కలిపి తింటే చాలా మంచిది.ఉల్లిపాయలు శరీరాన్ని చల్లబరచడమే కాకుండా వడదెబ్బ నుండి కాపాడుతుంది.

పుదీనా ఆకులు కూడా శరీరానికి చల్లదనాన్ని ఇస్తాయి.సమ్మర్ లో రోజుకు ఒక కప్పు పుదీనా టీ తాగితే బాడీ హీట్ మాయం అవ్వడమే కాదు వెయిట్ లాస్ కూడా అవుతారు.ఇవే కాకుండా ఆకుకూరలు, అవకాడో, సిట్రస్ పండ్లు, సబ్జా గింజలు, మెంతులు, మజ్జిగ, రాగి జావ, చేపలు వంటి ఫుడ్స్ కూడా శరీర వేడిని తగ్గించగలవు.కాబట్టి సమ్మర్ లో తప్పకుండా ఈ ఫుడ్స్ ను డైట్ లో చేర్చుకోండి.
చల్లగా ఉండండి.