సూర్యాపేట జిల్లా:జిల్లాలోని హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని నేరేడుచర్ల మండలం చిల్లేపల్లి ప్రాథమిక సహకార సంఘంలో జరిగిన ధాన్యం కొనుగోళ్లల అవినీతిలో భాగస్వాములైన చైర్మన్,వైస్ చైర్మన్,సీఈఓలపై నేటి వరకు అధికారులు చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని ఆ సొసైటీ డైరెక్టర్లు ఆరోపించారు.శుక్రవారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ లో వారు మీడియాతో మాట్లాడాతూ చిల్లేపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో ఖరీఫ్ సీజన్లో చోటు చేసుకున్న ధాన్యం కుంభకోణంలో సొసైటీ చైర్మన్,వైస్ చైర్మన్, సిఓల పాత్ర ఉందన్నారు.
ధాన్యం కొనుగోలు చేయకుండానే కొనుగోలు చేసినట్టు తప్పుడు పట్టీలను సృష్టించి కోట్ల రూపాయల అవినీతికి సొసైటీ చైర్మన్ పాల్పడ్డారని వారు ఆరోపించారు.ధాన్యం కుంభకోణంలో జరిగిన అవకతవకలపై పూర్తి ఆధారాలతో జిల్లా సొసైటీ అధికారికి అందించినా అక్రమార్కులపై నేటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఏమిటని ప్రశ్నించారు.
అవినీతికి పాల్పడిన సొసైటీ చైర్మన్ ను తొలగించాలని తాము ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఆమోదించామని వారు పేర్కొన్నారు.అనంతరం అదనపు కలెక్టర్ మోహన్ రావుకు వినతిపత్రం అందించారు.
ఈ కార్యక్రమంలో చిల్లేపల్లి పిఎసిఎస్ డైరెక్టర్లు ఎం.రమణరెడ్డి, ఎం.హేమలత,కె.పిచ్చయ్య,ఎం.
గోవింద్, పి.రంగారెడ్డి,వేముల శ్రీను,సిహెచ్.వీరారెడ్డి,ఎం.లక్ష్మారెడ్డి,పి.ముత్తమ్మ తదితరులు పాల్గొన్నారు.