సూర్యాపేట జిల్లా: ప్రజలకు అన్ని ప్రభుత్వ శాఖలు ఒక సముదాయంలో ఉండడం వల్ల పరిపాలన సౌకర్యవంతంగా ఉంటుందని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు తెలిపారు.బుధవారం ఉదయం నూతన కలెక్టరేట్ సమీకృత సముదాయంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కార్యాలయం (F14, 15 ), ఉద్యానవన శాఖ అధికారి కార్యాలయం (24,27), ఉపాధి కల్పన కార్యాలయం(S-29) జిల్లా పరిశ్రమల శాఖ (S-19,20) జిల్లా ఆడిట్(S-10) కార్యాలయం,జిల్లా సర్వే ల్యాండ్స్ కార్యాలయములను జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ ఏ వెంకట్ రెడ్డి,
డీఎఫ్ఓ సతీష్ కుమార్ తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పరిపాలన సౌలభ్యంలో భాగంగా ప్రభుత్వ మార్గదర్శకాలకు లోబడి కలెక్టరేట్ సముదాయంలో అన్ని శాఖల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించడం జరుగుతుందన్నారు.శాఖల వారీగా జిల్లా అధికారులను తమ సీటులో కూర్చోబెట్టి కలెక్టర్ సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
కలెక్టర్ వెంట అగ్రికల్చరల్ అధికారి రామారావు నాయక్, ఉద్యానవన శాఖ అధికారి శ్రీధర్, సిపిఓ వెంకటేశ్వర్లు, ఉపాధి కల్పన అధికారి మాధవరెడ్డి,పరిశ్రమల శాఖ అధికారి తిరుపతయ్య,జిల్లా ఆడిట్ అధికారి,ఇతర అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.







