తెలుగు బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి యాంకర్ సుమ( Anchor Suma )గత మూడు దశాబ్దాలకు తెలుగు తెరపై వరుస కార్యక్రమాలకు యాంకర్ యొక్క వ్యవహరిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా యాంకర్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె రాజీవ్ కనకాలను వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే అయితే వీరిద్దరిది ప్రేమ వివాహం( Love Marriage ) వీరిద్దరూ ప్రేమించుకొని వీరి ప్రేమ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేసి వారిని ఒప్పించి మరి వివాహం చేసుకున్నారు.
ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి సుమ వారి ప్రేమ పెళ్లి గురించి కొన్ని విషయాలు తెలియజేశారు.

రాజీవ్ కనకాలతో తనకు పరిచయం ఏర్పడిన తర్వాత మొదటిగా ప్రపోజ్ చేశారని సుమ తెలిపారు.ఇలా ఇద్దరం ప్రేమించుకున్న విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశాము ఆయన కుటుంబం నుంచి మాకు ఏ విధమైనటువంటి ఇబ్బంది ఎదురు కాలేదు కానీ మా కుటుంబ సభ్యులు ఈ పెళ్ళికి ఒప్పుకోలేదని సుమా తెలిపారు.ఈ పెళ్లికి జరగడానికి వీలు లేదు అంటూ దాదాపు వారం రోజులపాటు తనని బంధించారని కూడా ఈమె తెలియజేశారు.
అయితే ఒక మంచి వ్యక్తిని మంచి కుటుంబాన్ని వదులుకుంటున్నాను అనే బాధ నాలో చాలా ఉంది చివరికి నా బాధను అర్థం చేసుకున్నటువంటి తన తల్లిదండ్రులు కూడా ఈ పెళ్లికి అంగీకరించారని తెలిపారు.

ఇక పెళ్లి తర్వాత ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి అంటూ ఎన్నో రకాల వార్తలు వచ్చాయి.పెళ్లయిన తర్వాత భార్య భర్తల మధ్య ఇలాంటి గొడవలు రావడం సర్వసాధారణం.నేను రాజీవ్ ప్రతిరోజు( Rajeev Kanakala ) ఏదో ఒక విషయం గురించి పోట్లాడుకుంటూ ఉంటామని అయితే కొంతసేపటికి ఆ గొడవ మర్చిపోయి తిరిగి ఎప్పటిలాగే ఉంటామని తెలిపారు.
ఇంకా కొన్నిసార్లు ఇద్దరం గొడవ పడి మాట్లాడుకోకుండా ఉన్న రోజులు కూడా ఉన్నాయి ఇలా ఒకసారి ఆయనతో గొడవ పడి 15 రోజులు మాట్లాడలేదని ఈ సందర్భంగా తెలిపారు.అయితే రాజీవ్ కి కోపం చాలా ఎక్కువ తొందరగా కోప్పడతారు.
ఎంత తొందరగా కోప్పడతారు అంతే తొందరగా ఆ కోపం నుంచి బయటకు వస్తారు అంటూ ఈ సందర్భంగా సుమా చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.







