ఇంటర్ లో రాష్ట్ర ప్రథమ ర్యాంకు సాధించిన విద్యార్థినులకి సన్మానం

సూర్యాపేట జిల్లా:ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షా ఫలితాల్లో రాష్ట్రంలోని మొదటి ర్యాంకు సాధించిన సూర్యాపేటకు చెందిన ఏనుగు అభినవి( Abhinavi ), నందమూరి మేఘనలను బుధవారం జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ కాకతీయ హైస్కూల్ యాజమాన్యం అభినందనలు తెలిపి సన్మానించారు.ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ కొండా సతీష్ మాట్లాడుతూ హైదరాబాద్ కాకతీయ హైస్కూల్ లో నాలుగో తరగతి నుండి పదో తరగతి వరకు చదువుకున్న అభినవి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో 468 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలోనే ప్రథమ స్థానం పొందడం మా పాఠశాలకే గర్వకారణమన్నారు.

 Awarded To The Girl Students Who Secured The First Rank In The State In Inter-TeluguStop.com

అలాగే నందమూరి మేఘన( Nandamuri Meghna ) ఏడో తరగతి నుండి పదో తరగతి వరకు మా పాఠశాలలోనే చదువుకొని రాష్ట్ర స్థాయిలో 465 మార్కులు సాధించడం అభినందనీయమన్నారు.అలాగే మా పాఠశాలలో చదువుకున్న ఎనిమిది మంది విద్యార్థులు 450 మార్కులపైగా సాధించారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అధ్యాపకులు లక్ష్మణరావు,కృష్ణ, పూర్ణచందర్,గౌస్,జనార్ధన్,మాధవి,అపర్ణ,శైలజ, విద్యార్థుల తల్లిదండ్రులు వీణ,అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube