సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న నూతన జిల్లా పోలీసు కార్యాలయ భవనం పనులను ఎస్పీ రాజేoద్రప్రసాద్ పరిశీలించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నూతన భవనాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చి సేవలు అందిస్తామని అన్నారు.
పనులు త్వరగా పూర్తి చేయాలని నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేసి అందించాలని కాంట్రాక్ట్ యాజమాన్యాన్ని ఆదేశించారు.రాష్ట్ర పోలీసు గృహ నిర్మాణశాఖ అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, కాంట్రాక్టర్,పోలీస్ ఇంజనీర్,సైట్ ఇంజనీర్స్ ఉన్నారు.