సంక్షేమ పథకాల పేరుతో మోసం చేస్తున్న కేసీఆర్:ధర్మార్జున్

సూర్యాపేట జిల్లా:ప్రజల యొక్క దీర్ఘకాలిక సమగ్రాభవృద్ధి పట్టించుకోకుండా కేవలం సంక్షేమ పథకాల బూచి చూపించి ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రజలను మోసo చేస్తున్నారని తెలంగాణ జనసమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యాపేట నియోజకవర్గ ఇంచార్జి ధర్మార్జున్ విమర్శించారు.తెలంగాణ జనసమితి చేపట్టిన జనచైతన్య యాత్రలో భాగంగా శుక్రవారం చెవ్వెంల మండలం వాల్యతండాలో పర్యటించారు.

 Kcr Is Cheating In The Name Of Welfare Schemes: Dharmarjun-TeluguStop.com

ఈ సంద్భర్భంగా ఆయన మాట్లాడుతూ స్ధానిక శాసనసభ్యులు నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోకుండా కల్లబొల్లి మాటలతో రాజకీయ కాలక్షేపం చేస్తున్నారని విమర్శించారు.ప్రజలను చైతన్యవంతం చేస్తూ టీఆర్ఎస్ మోసాలను ప్రజలకు వివరించడం కోసమే జనచైతన్య యాత్ర నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు మంద్ర మల్లయ్య,విద్యార్ధి సమితి అధ్యక్షుడు బొమ్మగాని వినయ్ గౌడ్,చివ్వెంల మండల పార్టీ ప్రధాన కార్యదర్శి సుమన్ నాయక్,మల్సూర్, అఖిల్,సూర్యా తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube