మంత్రిని కలిసి వినతిపత్రం అందజేసిన సమగ్ర శిశు అభియాన్ ఉద్యోగుల సంఘం

సూర్యాపేట జిల్లా: అరకొర వేతనాలతో పదిహేను ఏళ్లుగా ఉద్యోగం చేస్తున్నామని సమగ్ర శిశు అభియాన్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు.ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతనం అమలు చేయాలని కోరుతూ గురువారం జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు.

 Samagra Shishu Abhiyan Employees Association Request Letter To Minister Jagadish-TeluguStop.com

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరీక్షకు హాజరై రోస్టర్ పాయింట్ ఆధారంగా ఎంపికయ్యామని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే మా జీవితాల్లో మార్పు వస్తుందని భావించామన్నారు.

కానీ, ఇంతవరకు ఉద్యోగభద్రత, హెల్త్ కార్డులు, కనీస వేతనం అమలు కాక వివిధ శాఖలైన సిఆర్పీ, కేజీబీవీ,ఐఆర్పీ,గర్ల్స్ హాస్టల్,ఎంఐఎస్ కోఆర్డినేటర్స్,ఎల్డిఏ, టిటిఐ,ఎఎన్ఎం,బోధన, బోధనేతర శాఖలలో జిల్లా వ్యాప్తంగా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ శ్రమ దోపిడి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

మంత్రి స్పందించి మా సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టి కి తీసుకెళ్లి పరిష్కారించాలని కోరారు.ఈ కార్యక్రమంలో సమగ్ర శిష్ అభియాన్ ఉద్యోగుల సంఘం నాయకులు శ్రీదేవి, తేజశ్రీ,ఆర్,వెంకటేశ్వర్లు, జి.రవి కుమార్, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube