సూర్యాపేట జిల్లా:అక్టోబర్ 2 మహాత్మా గాంధీ జయంతిని పురష్కరించుకుని జిల్లా పోలీసు కార్యాలయం నందు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ గాంధీ ప్రపంచానికి సత్యం, అహింసా మార్గాలను చూపినారన్నారు.భారతదేశంలో స్వతంత్ర ఉద్యమ కారులను ఏకతాటిపైకి తెచ్చి అహింసతో దేశానికి స్వాతంత్రం సాధించి పెట్టి, అహింసా వాదంతో ఏదైనా సాధించవచ్చని నిరూపించారని గుర్తు చేశారు.
దేశ పౌరులు,గాంధేయ మార్గంలో నడుచుకోవాలని,గాంధీ చూపిన బాటలో పోలీసు విధులు నిర్వర్తించి ప్రజలకు పోలీసు సేవలను అందించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో డిఎస్పీలు నాగభూషణం,రవి,స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్,డిసిఆర్బి ఇన్స్పెక్టర్ నర్సింహ,సీఐలు సోమ్ నారాయణ్ సింగ్,రాజశేఖర్, సీసీఎస్ సిఐ రవి కుమార్,ఆర్ఐలు శ్రీనివాస్,శ్రీనివాస్ రావు,గోవిందరావు,నర్సింహారావు,ఎస్ఐలు,ఆర్ఎస్ఐలు,సిబ్బంది పాల్గొని గాంధీ చిత్రపటానికి పూలమాలు వేసి నివాళి ఘటించారు.