కాంగ్రేస్ అధికారంలోకి రావడం పక్కా

నల్లగొండ జిల్లా:రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రేస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని మునుగోడు కాంగ్రేస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ధీమా వ్యక్తం చేశారు.ఆదివారం మునుగోడు మండల కేంద్రంలో మహాత్మా గాంధీజీ జయంతి సందర్భంగా గాంధీఙి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

 Congress Is Sure To Come To Power-TeluguStop.com

అనంతరం గడపగడపకు కాంగ్రేస్ కార్యక్రమంలో భాగంగా కొరటికల్,చండూరు మున్సిపాలిటీలో పర్యటించి ఆడపడుచులకు గాజులు పంపిణీ చేశారు.ముందుగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన దుర్గాదేవి మందిరాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజగోపాల్ రెడ్డి మునుగోడు నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి శూన్యమని చెప్పారు.కాంగ్రెస్ పార్టీ హయాంలో అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు.

పాల్వాయి గోవర్ధన్ రెడ్డి బిడ్డగా మీ ముందుకు వస్తున్నానని,ఖచ్చితంగా నన్ను గెలిపించాలని అభ్యర్థించారు.టీఆర్ఎస్,బీజేపీ రెండు పార్టీలు దేశంలో,రాష్ట్రంలో ప్రజలను మోసం చేశాయన్నారు.

రాజగోపాల్ రెడ్డి కేవలం కాంట్రాక్టుల కోసం బీజేపీలోకి వెళ్లాడని ఏద్దేవా చేశారు.ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు,మహిళలు భారీగా పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube