నల్లగొండ జిల్లా: తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగియనుంది.నవంబర్ 7వ తేదీ నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.
అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్16వ తేదీ నాటికి మొత్తం 1,26,052 మంది అభ్యర్ధులు ఈ టెట్ 2024 పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు.వీరిలో పేపర్-1కు 39,741 మంది దరఖాస్తు చేసుకోగా పేపర్-2కు 75,712 మంది చేసుకున్నారు.
రెండిటికీ కలిపి 10,599 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.దరఖాస్తుల ప్రక్రియ ముగిసే నాటికి మరో 50వేల దరఖాస్తులు అందవచ్చని అధికారులు భావిస్తున్నారు.
అయితే ఇప్పటి వరకూ దరఖాస్తులు సమర్పించిన అభ్యర్థులు తమ అప్లికేషన్‌లో పొందుపరిచిన వివరాల్లో ఏవైనా తప్పులుంటే నవంబర్ 22వ తేదీ వరకు సవరించుకోవచ్చని అధికారులు తెలిపారు.
అభ్యర్థులు తెలంగాణ టెట్ 2024 ఎడిట్ ఆప్షన్ డైరెక్ట్ లింక్ క్లిక్ చేయమని చెబుతున్నారు.
కాగా టెట్ ఆన్‌లైన్ దరఖాస్తు గడువు నవంబర్ 20వ తేదీతో ముగియనున్న సంగతి పాఠకులకు తెలిసిందే.ఇక రేవంత్ సర్కార్ ఈసారి టెట్ దరఖాస్తులకు ఫీజు భారీగా తగ్గించారు.గతంలో ఒక్కో పేపర్‌కు రూ.1000,రెండు పేపర్లకు రూ.2 వేల ఫీజు చెల్లించ వల్సి వచ్చేది.ప్రస్తుతం దాన్ని రూ.750కి కుదించారు.ఇక రెండు పేపర్లు రాసేవారికి రూ.1000గా ఫీజు నిర్ణయించారు.అంతేకాకుండా ఈ ఏడాది మేలో నిర్వహించిన టెట్‌లో క్వాలిఫై అయినా కాకపోయినా అందులో దరఖాస్తు చేసుకున్న వారందరికీ ఈసారి టెట్‌కు ఉచితంగానే దరఖాస్తు చేసుకోవడానికి వెసులుబాటు కల్పించారు.
ఆసక్తి కలిగిన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్లో అప్లయ్ చేసుకోవచ్చు.ఇక వచ్చే ఏడాది జనవరి 1 నుంచి 20వ తేదీ వరకు టెట్ పరీక్షలు ఆన్‌లైన్ విధానంలో జరగను న్నాయి.
డిసెంబర్ 26వ తేదీ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.రోజుకు రెండు సెషన్లలో పరీక్ష ఉంటుంది.ఉదయం 9 గంటల నుంచి 11:30 గంటల వరకు మొదటి సెషన్,మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు రెండో సెషన్ పరీక్ష ఉంటుంది.