నల్లగొండ జిల్లా:నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని 20వ,వార్డులో గత మూడు నెలలుగా వీధిలైట్లు నిత్యం వెలుగుతూ విద్యుత్ వృథా అవుతున్నా మున్సిపాలిటీ, విద్యుత్ శాఖ అధికారులకు పట్టకపోవడం గమనార్హం.గతంలో సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యమని కాలనీవాసులు వాపోతున్నారు.
తక్షణమే అధికారులు వీటిపై తగు చర్యలు తీసుకొని ఆన్ ఆఫ్ స్విచ్ సిస్టం ఏర్పాటు చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.