నల్లగొండ జిల్లా:ఇటీవల మీర్పేట్ లో లైంగిక వేధింపులకు గురై ఆత్మహత్య చేసుకున్న పల్లపు దివ్య కుటుంబ సభ్యులను బుధవారం దేవరకొండ ఎమ్మెల్యే బాలూ నాయక్ వారి స్వగ్రామం తక్కెళ్ళపల్లిలో కలిసి పరామర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం తరఫున ఆ కుటుంబానికి ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
దివ్య మరణానికి కారకుడైన వానికి తగిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ సంజీవరెడ్డి,ఎంపీపీ భవాని,పవన్ కుమార్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగభూషణం, వర్కింగ్ ప్రెసిడెంట్ నర్సిరెడ్డి,మాజీ జెడ్పిటిసి గుంజ రేణుక,నారాయణ, ముచ్చర్ల యాదగిరి, టిపిసిసి సోషల్ మీడియా కోఆర్డినేటర్ నర్ర బాలు, రేపని పద్మ,యాదయ్య, కుటుంబ సభ్యులు లక్ష్మమ్మ,విజేందర్ తదితరులు పాల్గొన్నారు.