ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త.రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్( DSC Notification ) ను విడుదల చేసింది.
ఈ మేరకు 6,100 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు వైసీపీ ( YCP )సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.ఈ నేపథ్యంలో డీఎస్సీ నోటిఫికేషన్ ను మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు.మొత్తం 6,100 పోస్టుల్లో 2,299 మంది పోస్టులు స్కూల్ అసిస్టెంట్ కాగా.2,280 ఎస్జీటీ పోస్టులు ఉన్నాయి.అలాగే 1,264 పీజీటీ, 215 టీజీటీ, ప్రిన్సిపాల్స్ 42 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది.ఈనెల 12 వ తేదీ నుంచి డీఎస్సీ ప్రక్రియ ప్రారంభం కానుందని మంత్రి బొత్స ( Minister Botsa )తెలిపారు.
అలాగే ఏప్రిల్ 7వ తేదీన ఫలితాలను వెల్లడిస్తామని తెలిపారు.







