ఉమ్మడి అనంతపురం జిల్లా తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ( JC Prabhakar Reddy )కీలక వ్యాఖ్యలు చేశారు.వచ్చే ఎన్నికల్లో తమ కుటుంబానికి ఒకటే టికెట్ అని చంద్రబాబు( Chandrababu ) చెప్పలేదని పేర్కొన్నారు.
ఒక ఎమ్మెల్యేతో పాటు ఒక ఎంపీ టికెట్ కూడా కావాలని పార్టీ అధినేత చంద్రబాబును కోరామన్నారు.అయితే రెండు టికెట్లపై చంద్రబాబు అవును అనలేదు.
కాదు అనలేదని పేర్కొన్నారు.ఈ క్రమంలోనే పార్టీ అధిష్టానం రెండు టికెట్లు ఇస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది.