నల్లగొండ జిల్లా: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రిలోసోమవారం ఉదయం అగ్న
ప్రమాదం సంభవించి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆసుపత్రి( Hospital )లోని బాలింతలు,గర్భిణీలు భయబ్రాంతులకు గురై బయటకు పరుగులు తీశారు.తెల్లవారుజామున కావడంతో అప్పుడే నిద్ర నుంచి తేరుకోనే సమయంలో పెద్ద శబ్దంతో పోగలు కమ్ముకోవడంతో బాలింతలు,గర్భిణీలు ఆహాకారాలు చేశారు.
పేషెంట్ల బంధువులు, కుటుంబ సభ్యులు పసిపిల్లలను తీసుకొని భయంతో బయటకు పరుగులు తీశారు.ఆసుపత్రిలో సిలిండర్ పేలడంతో ఈ సంఘటన జరుగినట్లు ప్రాథమిక సమాచారం.సిలిండర్ పేలుడు ధాటికిపెద్దగా శబ్దం రావడంతోఅందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రి ( Nalgonda Government Hospital )నిర్వహణపై మొదటి నుంచి అనేక విమర్శలు వినిపిస్తుండడం గమనార్హం.
ఇదిలా ఉంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో వరుస అగ్ని ప్రమాదాలుకలకలం రేపుతున్నాయి.గతంలో నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రిలోని ఐసీయూలో షార్ట్ సర్క్యూట్తో అగ్నిప్రమాదం చోటు చేసుకోగా,తాజాగా నల్లగొండ( Nalgonda ) ప్రభుత్వ ఆసుపత్రిలోని మాత శిశు సంరక్షణ కేంద్రంలో పసిపిల్లల వార్డులో అగ్ని ప్రమాదం జరగడం నిర్వహణ లోపాన్ని తెలియజేస్తుంది.