శునకాల జోరుకు బేజారవుతున్న ప్రజలు

నల్లగొండ జిల్లా:తిరుమలగిరి (సాగర్) మండల కేంద్రంలో వీధి కుక్కలు జోరుగా షికారు చేస్తుంటే ప్రజలు భయంతో బేజారెత్తిపోతున్నారు.గ్రామంలో ఎక్కడ చూసినా వీధి కుక్కలు గుంపులు, గుంపులుగా సంచరిస్తూ చిన్నా పెద్ద అని తేడా లేకుండా దాడి చేస్తున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 People Who Are Angry With Dogs , Dogs ,tirumalagiri, Gram Panchayat Officers-TeluguStop.com

దీంతో బయటికి రావాలంటే రోడ్లమీద భయపడి పోతున్నామని,చిన్న పిల్లపై దాడి చేసి గాయపరుస్తున్నాయని వాపోతున్నారు.తిరుమలగిరి సెంటర్ లో ఉన్న మెయిన్ రోడ్డులో వచ్చిపోయే, వాహనాలపై,పాదచారులపై దాడి చేస్తున్నాయని,కుక్కల బెడద నుండి తప్పించుకునే ప్రయత్నంలో ప్రమాదాల బారిన పడుతున్నారని,కనీసం కుక్కల బెడద నుండి ప్రజలకు విముక్తి కల్పించాలనే ఆలోచన కూడా అధికారులకు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికైనా గ్రామ పంచాయతీ అధికారులు కుక్కల బెడదపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube