గ్రంధాలయ నిర్మాణానికి నడుం బిగించిన నవతరం

నల్లగొండ జిల్లా: గుర్రంపోడ్ మండలం కొప్పోల్ గ్రామంలో ఖాళీగా పాత పశువుల ఆసుపత్రి భవనాన్ని గ్రంధాలయంగా మార్చుటకు గ్రామయువత నడుంబిగించారు.దాని మరమ్మతులకు సుమారు మూడు రూ.

 Youth Coming Forward For Library Construction, Youth , Library Construction, Kop-TeluguStop.com

లక్షల వరకు ఖర్చవుతుందని అంచనా వేశారు.దీంతో దాతల సహకారం కోసం గ్రామ యువత ఎదురు చూస్తున్నారు.

మంచి మనసుతో దాతలు స్పందించి గ్రంధాలయ నిర్మాణానికి సహకరించాలని కోరుతున్నారు.

ఊర్లో గ్రంధాలయం ఉన్నట్లయితే ఎంతోమంది యువత పోటీ పరీక్షల్లో విజయం సాధించేందుకు అవకాశం ఉంటుందని, నిరుద్యోగ యువతకు ఉపయోగంగా ఉంటుందని గ్రామ యువత అంటున్నారు.

ఫోన్ పే, గూగుల్ పే నెంబర్ 7661878261 ద్వారా కూడా సహాయం చేయవచ్చని తెలిపారు.వల్కి గణేష్,కన్నెబోయిన శ్రీకాంత్,భైరవోణీ నవీన్, వల్కి శ్రీకాంత్,మాతంగి కృష్ణ,షేక్ అవేజ్,ముర్సు నవీన్ లను గ్రంధాలయ నిర్మాణ కమిటీగా ఎన్నుకున్నారు.

మా ఊర్ల చదువుకున్న యువకులు చాలా మంది ఉన్నరు.వివిధ రకాల పోటీ పరీక్షలకుప్రిపేర్ అవుతున్నారు.అందరికి ఇండ్ల దగ్గర సరైన సౌకర్యాలు లేకపోవడంతో ఊర్ల గ్రంధాలయం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నామని గ్రంధాలయ నిర్మాణ కమిటీ సభ్యులు భైరవోని నవీన్ అన్నారు.దాతల నుండి విరాళాలు సేకరించి గ్రంధాలయం నిర్మాణం చేపట్టే ప్రయత్నం చేస్తున్నాం.

ప్రతీ గ్రామంలో గ్రంథాలయం ఉంటే యువత ఆలోచనల్లో మార్పు వస్తుందన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube