సొంతింట్లోకి మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి

నల్లగొండ జిల్లా:ఇకపై ప్రతి రోజు మండల కేంద్రంలో ఉండేవిధంగా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడులో సొంతిల్లు ఏర్పాటు చేసుకున్నారు.ఆదివారం శాస్త్రోత్మకంగా తన సతీమణి లక్ష్మితో కలిసి వేదపండితుల ఆశీర్వచనాల మధ్య హోమాలు,పూజలు నిర్వహించారు.

 Former Mla Komati Reddy To His Home-TeluguStop.com

మునుగోడు నియోజకవర్గంలోని అన్ని మండలాల నుండి వచ్చిన దాదాపు పదివేల మంది కార్యకర్తలకు భోజన ఏర్పాట్లు చేసి వారికి స్వయంగా వడ్డించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇకపై ప్రతి రోజు తన వసతి గృహం వద్దే రెండు వేల మందికి భోజనాలు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

అనంతరం గాంధీ జయంతి సందర్బంగా గాంధీజీ ఫోటోకి పూల మాల వేసి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర చేరికల కమిటీ కన్వీనర్,హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ హాజరయ్యారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube