ఉమ్మడి నల్లగొండ జిల్లా -5 రేషన్ దుకాణాలను పరిశీలించిన మంత్రి ఉత్తమ్

రీ సైక్లింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిక శనార్తి తెలంగాణ/ఉమ్మడి నల్లగొండ:గత ప్రభుత్వ నిర్వాకం వల్ల సివిల్ సప్లైస్ కార్పోరేషన్ రూ.56వేల కోట్ల అప్పుల్లో,రూ.11వేల కోట్ల నష్టాల్లో ఉందని రాష్ట్ర నీటిపారుదల మరియు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ( Uttam Kumar Reddy )అన్నారు.సోమవారం సూర్యాపేట జిల్లా( Suryapet District ) హుజూర్ నగర్ నియోజకవర్గంలో పలు రేషన్ దుకాణాలను సందర్శించి పరిశీలించారు.

 Minister Uttam Inspected The Joint Nalgonda District-5 Ration Shops, Uttam Kuma-TeluguStop.com

ఈ సందర్భంగా తెలంగాణా( Telangana )లో 89 లక్షల కుటుంబాలకు నెలకు ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున సరఫరా చేస్తున్న రేషన్ బియ్యం నాణ్యత, ఇతర అంశాలపై రేషన్ డీలర్లతో మాట్లాడారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాలు కిలో బియ్యానికి 39 రూపాయలు ఖర్చు పెట్టి ఉచితంగా ఇస్తున్న రేషన్ బియ్యాన్ని మిల్లర్లు గానీ, ఇతరులు ఎవరైనా రీ సైక్లింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

ప్రతి ఏటా సివిల్ సప్లైస్ కార్పోరేషన్ పై కేవలం వడ్డీ భారమే 3 వేల కోట్లుందన్నారు.రైస్ మిల్లర్ల దగ్గర 22వేల కోట్ల దాన్యం నిల్వలు గత ప్రభుత్వం పెట్టడంపై సమీక్ష జరుపుతున్నామన్నారు.

సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ చేపడుతున్న ధాన్యం సేకరణ పద్దతులను,రేషన్ వ్యవస్థను మరింత మెరుగు పరిచే ప్రయత్నం చేస్తున్నామన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube