అఖిలభారత పశుగణనను విజయవంతం చేయండి

నల్లగొండ జిల్లా:21వ,అఖిల భారత పశుగణనను విజయవంతం చేయాలని మండల పశు వైద్యాధికారి నాగార్జున రెడ్డి అన్నారు.శనివారం పెద్దవూర మండలం బట్టుగూడం గ్రామంలో పశుగణన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పశుగణనను మండలంలోని పశువులు కలిగిన రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

 Make The All India Livestock Census A Success, All India Livestock Census , Vet-TeluguStop.com

తమ పశువుల వివరాలను నమోదు చేసుకుంటే తద్వారా పశువుల ద్వారా పొందే లోన్లు,పశువుల ఉత్పత్తి,పశువుల సంఖ్య మొత్తం సమాచారం అందుబాటులో ఉంటుందని తెలిపారు.తప్పనిసరిగా రైతుల వద్ద గల గేదెలు,ఆవులు, మేకలు,గొర్రెలు,కోళ్లు వివరాలను పశుగణన అధికారుల వద్ద నమోదు చేసుకోవాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో వెటర్నరీ అసిస్టెంట్ అనిత,గోపాలమిత్ర గాలి లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube