అఖిలభారత పశుగణనను విజయవంతం చేయండి

నల్లగొండ జిల్లా:21వ,అఖిల భారత పశుగణనను విజయవంతం చేయాలని మండల పశు వైద్యాధికారి నాగార్జున రెడ్డి అన్నారు.

శనివారం పెద్దవూర మండలం బట్టుగూడం గ్రామంలో పశుగణన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పశుగణనను మండలంలోని పశువులు కలిగిన రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

తమ పశువుల వివరాలను నమోదు చేసుకుంటే తద్వారా పశువుల ద్వారా పొందే లోన్లు,పశువుల ఉత్పత్తి,పశువుల సంఖ్య మొత్తం సమాచారం అందుబాటులో ఉంటుందని తెలిపారు.

తప్పనిసరిగా రైతుల వద్ద గల గేదెలు,ఆవులు, మేకలు,గొర్రెలు,కోళ్లు వివరాలను పశుగణన అధికారుల వద్ద నమోదు చేసుకోవాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో వెటర్నరీ అసిస్టెంట్ అనిత,గోపాలమిత్ర గాలి లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

గ్రహశకలాన్ని గుర్తించి అరుదైన ఘనత సాధించిన విద్యార్థి