యాదాద్రి జిల్లా: తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ ను నిరసిస్తూ రాష్ట్ర బీజేపీ పిలుపు మేరకు బీజేపీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భువనగిరి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద పార్టీ శ్రేణులు నల్ల బ్యాడ్జీలు ధరించి,అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన వ్యక్తం చేశారు.సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా బీజేపీ అధ్యక్షుడు పి.
డి.సుందర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాజ్యాంగం అంటే గౌరవం లేదని,అందువల్లనే అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని రద్దు చేయాలని అన్నాడని గుర్తు చేశారు.చిన్న చిన్న కారణాలు చూబుతూ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు నిర్వహించడం,బీజేపీ ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలు లేవనెత్తుతారని బయపడి అసెంబ్లీ సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేశారని విమర్శించారు.ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ నాయకులు,పట్టణ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.