నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలో ఈనెల 21 తేదీ నుంచి 24 తేదీ వరకు జరిగిన ప్రజాపాలన గ్రామ సభల్లో అర్హులైన లబ్ధిదారుల నుంచి ఇందిరమ్మ ఇండ్లు,కొత్త రేషన్ కార్డు,ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వంటి పథకాలకు సంబంధించిన 4114 దరఖాస్తులు వచ్చాయని శనివారం మర్రిగూడ ఎంపీడీఓ మున్నయ్య తెలిపారు.ఇందిరమ్మ ఇండ్లు 1503,కొత్త రేషన్ కార్డు 2179,ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 432 దరఖాస్తులు వచ్చినట్టు వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందన్నారు.