నల్లగొండ జిల్లా:అంబేద్కర్ ఆశలు,ఆశయాలకు విరుద్దంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందని, తొమ్మిది సంవత్సరాల కాలంలో దళిత వర్గాలను నమ్మించి మోసం చేసి, అభివృద్ధికి దూరం చేసిన ఘనత సీఎం కేసిఆర్ కే దక్కిందని నల్గొండ జిల్లా బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు గోలి ప్రభాకర్( Goli Prabhakar ) అన్నారు.
శుక్రవారంబీజేపీ( bjp ) ఎస్సీ మోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు కట్టంగూర్ మండలం అయిటిపాముల గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి వినతిపత్రం అందించారు.
ఈ సందర్బంగా ఆయనమాట్లాడుతూ దళితుణ్ణి ,సీఎం( CM KCR ) చేస్తానని,దళితులకు మూడు ఎకరాలు భూమి ఇస్తానని,డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తానని ఇవ్వకుండా మోసం చేశారని అన్నారు.దళితులకు ఉద్యోగాలు, ఇవ్వలేదు,నిరుద్యోగ భృతి లేదు,సబ్సిడీ రుణాలు లేవు,ఇలా ఏ రకంగా చూసినా దళితులను పూర్తిగా నమ్మించి మోసం చేసిన కేసీఆర్ ను ప్రజలు ఎప్పటికి మర్చిపోరని అన్నారు.
ఇప్పటికైనా దళితుల్లో అర్హులైన వారందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని,అందరికీ దళిత బంధు ఇవ్వాలని,డప్పు, చెప్పు పని చేసే వారికి పింఛను ఇవ్వాలని డిమాండ్ చేశారు.లేకపోతే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి దళితులు తగిన విధంగా బుద్ది చెబుతారని అన్నారు.
ఈ కార్యక్రమంలోఅయిటిపాముల మాజీ ఎంపిటిసి పబ్బు వెంకన్న, నీలం నాగరాజు,నల్గొండ లింగయ్య,బొమ్మగాని నాగరాజు,జూలూరి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.