ఈరోజు థియేటర్లలో విడుదలైన బేబీ సినిమాకు( Baby Movie ) ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా ఇంటర్వెల్ ట్విస్ట్ అద్భుతంగా ఉండగా క్లైమాక్స్ విషయంలో మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
దర్శకుడు క్లైమాక్స్ కొత్తగా ఉంటుందని ఆ విధంగా ప్లాన్ చేసినా ఎక్కువమంది క్లైమాక్స్ మరోలా ఉంటే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఈ సినిమాని బోల్డ్ డైలాగ్స్ పై( Bold Dialogues ) భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
నువ్వు తెరవాల్సింది కళ్లు కాదు కాళ్లు లాంటి బూతు డైలాగ్ ల వల్ల కొంతమంది ఫ్యామిలీ ప్రేక్షకులు ఈ సినిమాకు దూరమయ్యే ఛాన్స్ అయితే ఉంది.మంచి సినిమాను ఇలాంటి డైలాగ్స్ తో చెడగొట్టేశారని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
బేబీ సినిమా అద్భుతంగా ఉందని కొన్ని డైలాగ్స్ విజిల్స్ వేయించేలా ఉంటే కొన్ని బూతు డైలాగ్స్ పంటికి రాయిలా గుచ్చుకుంటున్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

బేబీ సినిమాలో కమర్షియల్ ప్రేక్షకులకు సైతం నచ్చే అంశాలకు కొదువ లేదు.ప్రేక్షకులు అసహ్యించుకునేలా వైష్ణవి పాత్రను( Vaishnavi Chaitanya ) దర్శకుడు తెరకెక్కించారు.గతంలో విడుదలైన కొన్ని సినిమాలను గుర్తు చేసేలా ఈ సినిమా ఉండటం గమనార్హం.
బేబీ సినిమా కమర్షియల్ గా సంచలనాలను సృష్టిస్తుందేమో చూడాలి.ఈ వీకెండ్ సమయానికి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

బ్రో మూవీ( Bro Movie ) విడుదలయ్యే వరకు బేబీ మూవీ దూకుడుకు అడ్డుకట్ట వేయలేమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.బేబీ మూవీ సక్సెస్ తర్వాత వైష్ణవి చైతన్యకు సినిమా ఆఫర్లు పెరగడం ఖాయమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.బేబీ ఫుల్ రన్ కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది.బేబీ మూవీ సక్సెస్ తో ఈ తరహా సినిమాలు మరిన్ని తెరకెక్కే అవకాశం ఉంటుంది.







