ఆనంద్ దేవరకొండ ( Anand Devarakonda ) వైష్ణవి చైతన్య( Vaishnavi Chaitanya ) హీరో హీరోయిన్లుగా సాయి రాజేష్ ( Sai Rajesh )దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా చిత్రం బేబీ(Baby).ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
అయితే ఒక చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్ద విజయాన్ని అందుకుంది.నేడు థియేటర్లలో విడుదలైనటువంటి ఈ సినిమా మొదటి షో నుంచి మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని దూసుకుపోతుంది.
ఇలా ఆనంద్ దేవరకొండ చాలా రోజుల తర్వాత మంచి హిట్ అందుకున్నారు.ఇక యూట్యూబర్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న వైష్ణవి చైతన్య మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.

ఇక ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని థియేటర్లలో ప్రేక్షకులను సందడి చేస్తోంది.అయితే ఈ సినిమా ఓటీటీ పార్ట్నర్ కూడా లాక్ అయినట్టు తెలుస్తుంది.ఈ సినిమా ఓటీటీ హక్కులను( Digital Rights ) ప్రముఖ తెలుగు ఓటీటీ సమస్థ ఆహా( Aaha ) వారు మంచి ధరలకు కొనుగోలు చేశారని తెలుస్తోంది.అయితే ఈ సినిమా థియేటర్లో విడుదలైనటువంటి ఆరు వారాలు పూర్తి అయిన వెంటనే ఆహాలో ప్రసారం కాబోతోంది.
అంటే ఈ సినిమా ఆగస్టు చివరివారం ఓటీటీ అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది.

ఇక ఈ సినిమా నుంచి విడుదలైనటువంటి లిరికల్ సాంగ్ ఓ రెండు ప్రేమ మేఘాలిలా అనే పాట విడుదలైన అనంతరం ఈ సినిమాపై భారీ హైప్ ఏర్పడింది.ఇప్పుడు అందుకు అనుగుణంగానే సినిమా కూడా ఉందని ప్రేక్షకులు ఈ సినిమా గురించి పాజిటివ్ రివ్యూ ఇస్తున్నారు.ఇక ఈ సినిమా తెలిసిన ప్రేమకథలాగే ఉన్నప్పటికీ డైరెక్టర్ ఈ సినిమాని డీల్ చేసిన విధానం టేకింగ్ డైలాగ్స్ చాలా అద్భుతంగా ఉన్నాయని ప్రతి ఒక్కరు ఈ సినిమాపై పాజిటివ్ రివ్యూ ఇస్తున్నారు.







