నల్లగొండ జిల్లా:మిర్యాలగూడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎం.సి కోటిరెడ్డిని ఘనంగా సన్మానించారు.
ఓ న్యాయవాదిగా బార్ అసోసియేషన్ సభ్యులుగా ఉన్న ఎం.సి.కోటిరెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నికైన సందర్భంగా మిర్యాలగూడ బార్ అసోసియేషన్ వారు స్థానిక మిర్యాలగూడ కోర్టు ఆవరణలో ఆయనకు సన్మాన సభ నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కోటిరెడ్డిని గజమాలతో సన్మానించి,శాలువాలతో ఘనంగా సత్కరించి,మెమొంటోలను అందజేశారు.
ఎమ్మెల్సీ కోటిరెడ్డికి న్యాయమూర్తులు,సహచర న్యాయవాదులు,కోర్టు సిబ్బంది ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎనిమిదోవ జిల్లా అడిషనల్ కోర్టు జడ్జి ఆర్.రఘునాథ్ రెడ్డి,స్థానిక ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు,బార్ అసోసియేషన్ అధ్యక్షులు రామకృష్ణారెడ్డి,ప్రధాన కార్యదర్శి జె.ఎల్లయ్య,న్యాయమూర్తులు, న్యాయవాదులు,కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.