నల్లగొండను మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యం: ఎస్పీ

నల్లగొండ జిల్లా: మిర్యాలగూడ సబ్ డివిజన్ పరిధిలో గంజాయి సేవిస్తూ పట్టుబడిన దాదాపు 130 మంది యువకులకు వారి తల్లితండ్రుల సమక్షంలో మిషన్ పరివర్తన్ కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్( District SP Sarath Chandra Pawar ) కౌన్సెలింగ్ ఇచ్చారు.గురువారం మిర్యాలగూడలో మాదక ద్రవ్యాలు తీసుకోవడంవల్ల జరిగే నష్టాలు,వాటి దుష్పరిణామాలు,వాటి బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డా.

 The Aim Is To Make Nalgonda A Drug-free District: Sp ,district Sp Sarath Chandr-TeluguStop.com

విజయ్ కుమార్ సైక్రియాటిస్ట్ చే పునర్వవస్థీకరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాలకు బానిసై జీవితాలను నాశనం చేసుకుంటున్నారని,ఒక్కసారి వీటికి బానిసైతే జీవితంలో కోలుకోవడం చాలా కష్టం అవుతుందని అన్నారు.

ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీసు స్టేషన్లో మాదక ద్రవ్యాల టెస్టింగ్ కిట్లు అందుబాటులో ఉన్నాయని,ప్రతి రోజూ డ్రంక్ అండ్ డ్రైవ్ తరహాలో స్పెషల్ డ్రైవ్( Special drive ) లు నిర్వహిస్తున్నమన్నారు.ఒక్కసారి గంజాయి, ఇతర మత్తు పదార్థాలు సేవిస్తే 6 నెలల వరకు దీని యొక్క ప్రభావం శరీరంలో ఉంటాయన్నారు.

తెలిసి తెలియక మొదటిసారిగా సేవించి పట్టుబడినారు కాబట్టి ఇట్టి పునర్వవస్థీకరణ కార్యక్రమం ద్వారా మార్పు కొరకు ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

వీరికి ఇంకా 1,2 సార్లు కౌన్సిలింగ్ ఇచ్చి మళ్ళీ టెస్టింగ్ చేయబడతాయని,దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

మళ్ళీ రెండవసారి మాదక ద్రవ్యాలు సేవించి పట్టుబడుతే 6 నెలల వరకు జైలు శిక్ష ఉంటుందని గుర్తు చేశారు.ఒక్కసారి పట్టుబడి జైలుకు వెళ్తే జీవితంలో ప్రభుత్వ,ప్రైవేట్ ఉద్యోగాలకు అనర్హులు అవుతారన్నారు.

జిల్లాలో మాదకద్రవ్యాల క్రయవిక్రయాలు,వాటి వినియోగంపై ఉక్కుపాదం మోపుతామన్నారు.ఎవరైనా మాదకద్రవ్యాలు అమ్మినా,సరఫరా చేసినా, సేవించినా వెంటనే డయల్ 100 గాని,వాట్సప్ నంబర్ 8712670266 గాని, సంబంధిత పోలీస్ స్టేషన్ కి గాని సమాచారం అందించాలని,వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రాములు నాయక్, మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు,సిఐలు కరుణాకర్,వీరబాబు, నాగరాజు,జనార్ధన్,ఎస్ఐలు,ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube