యాదాద్రి భువనగిరి జిల్లా: సంస్థాన్ నారాయణపురం మండలం( Narayanapur ) పుట్టపాక గ్రామానికి చెందిన సిహెచ్.శిరీష( Sirisha ) బోధనలో మెలుకువలు పాటిస్తూ విద్యాబోధన చేయడంతోఉపాధ్యాయ దినోత్సవం ( Teachers Day )పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిసంవత్సరం అందించే ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల్లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు.
ప్రస్తుతం ఆమె నల్లగొండ జిల్లా గట్టుప్పల్ మండలంలోని కాశవారిగూడెం ప్రభుత్వ పాఠశాలలో ఎస్జీటిగా విధులు నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా ఆమె గురువారం మాట్లాడుతూ తరగతి గదిలో విద్యార్థులకు బోధనలో మెళుకువలు,విద్యార్థులకు చదువుపట్ల ఆసక్తిని కలిగిస్తూ వారి భవిష్యత్తు కోసం కృషి చేయడమే తన లక్ష్యంగా పెట్టుకున్నానని తెలిపారు.
జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపిక కావడంతో గ్రామస్తులు,తోటి ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.