అసలే ఎండా కాలం.ఈ సీజన్‌లో ఆరోగ్యాన్ని, చర్మాన్ని కాపాడుకుంటే సరిపోదు.
కురుల విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ వహించాలి.లేదంటే శిరోజాల ఆరోగ్యం దెబ్బ తింటుంది.
ఫలితంగా జుట్టు రాలడం, పొడి బారడం, చిట్లడం వంటి రకరకాల సమస్యలు తీవ్రంగా ఇబ్బంది పెడతాయి.అయితే ప్రస్తుత వేసవి కాలంలో ఇప్పుడు చెప్పబోయే సింపుల్ టిప్స్ ను పాటిస్తే కురుల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ టిప్స్ ఏంటో తెలుసుకుందాం పదండీ.
ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల దాల్చిన చెక్క పొడి, వన్ టేబుల్ స్పూన్ సీ సాల్ట్, నాలుగు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ వేసుకుని అన్నీ కలిసేలా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి స్మూత్‌గా రెండు నిమిషాల పాటు స్క్రబ్ చేసుకోవాలి.గంట అనంతరం మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి.వారంలో ఒకసారి ఈ స్క్రబ్బింగ్ ప్యాక్‌ను యూజ్ చేస్తే ఎండల వల్ల తలలో ఏర్పడిన దుమ్ము, ధూళి, మృతకణాలు పూర్తిగా తొలగిపోతాయి.చుండ్రు సమస్య ఉన్నా దూరం అవుతుంది.
అలాగే వేసవి కాలంలో చాలా మంది హెయిర్ ఆయిల్స్‌ను ఎవైడ్ చేస్తుంటారు.కానీ, కాలం ఏదైనా రెండు రోజులకు ఒకసారి తప్పకుండా హెయిర్‌కు ఆయిల్‌ను పెట్టుకోవాలి.అప్పుడే కుదుళ్ల బలంగా మారి జుట్టు రాలడం తగ్గుతుంది.వేసవి కాలంలో నాలుగు రోజులకు ఒకసారి తలస్నానం చేయాలి.లేదంటే తలలో పట్టే చెమట, దాని కారణంగా ఏర్పడే జిడ్డు అలర్జీలకు దారి తీస్తుంది.తల స్నానం చేసిన వెంటనే జడ వేసుకునే అలవాటు చాలా మందికి ఉంటుంది.
కానీ, జుట్టు పూర్తిగా ఆరిన తర్వాతే జడ వేసుకోవాలి.లేదంటే రకరకాల జుట్టు సమస్యలు ఎదురవుతాయి.
అలాగే సమ్మర్‌లో డ్రై హెయిర్ సమస్య తీవ్రంగా వేధిస్తుంటుంది.అయితే ఈ సమస్యను పరిష్కరించడంలో పుల్లటి పెరుగు గ్రేట్‌గా సహాయపడుతుంది.పుల్లటి పెరుగును జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి.రెండు గంటల అనంతరం తలస్నానం చేయాలి.ఇలా చేస్తే కురులు హైడ్రేటెడ్‌గా ఉంటాయి.