నీటిపారుదల పనుల్లో నిర్లక్ష్యంపై మంత్రి ఉత్తమ్ సిరియస్

సూర్యాపేట జిల్లా: హుజూర్ నగర్ నియోజకవర్గ నీటి పారుదల శాఖ పనితీరుపై ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అసహనం వ్యక్తం చేస్తూ డిఈ సస్పెండ్ చేయాలని సిఈని ఆదేశించారు.సోమవారం సూర్యాపేట జిల్లా కోదాడలోని కాశీనాధం ఫంక్షన్ హాల్ జిల్లాస్థాయి అధికారులతో కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల అభివృద్ది పనులపై మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.

 Minister Uttam Is Serious About Negligence In Irrigation Works , Irrigation Work-TeluguStop.com

ఈ సందర్భంగా ఇరిగేషన్ శాఖ పనితీరుని రైతులు మంత్రి దృష్టికి తీసుకురావడంతో రైతులు లేవనెత్తిన సమస్యలపై అధికారులను వివరణ అడగగా సరైన సమాధానాలు ఇవ్వకపోవడంపై మంత్రి సీరియస్ అయ్యారు.విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న ఏఈ,డిఈని హెచ్చరించారు.

లిఫ్ట్ ఇరిగేషన్ పనులను చాలా ఈజీగా తీసుకుంటున్నారని,పొద్దునొచ్చి సాయంత్రం పోయినట్టుగా ఉందన్నారు.కోట్ల రూపాయల ఇరిగేషన్ స్కీంలో అనధికార వ్యక్తులు పైపులు తొలగిస్తే పోయేందుకు తీరిక లేదా అని డిఈ నవీన్ ని నిలదీశారు.

బాధ్యత లేని డీఈని సస్పెండ్ చేయాలని సీఈకీ సూచించారు.ఇవాళ రేపు అని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని,గాలికి చేతులు ఊపుకుంటూ వస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.ఈరివ్యూలో కొంతమందిపై తప్పకుండా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.30 లక్షల వర్క్ రెండు నెలల్లో కనీసం పూర్తి కాకపోవడం ఏంటని మండిపడ్డారు.దొండపాడు, రేవూరు లిఫ్ట్ ల పనులు ఎప్పటి లోపల పూర్తి చేస్తారని అధికారుల నుండి టైం బాండ్తీసుకున్నారు.అన్ని లిఫ్టులు పూర్తిస్థాయిలో పనిచేయాలని,అధికారుల నిర్లక్ష్యంగా పనిచేస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

ఈకార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్,నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు,ప్రజాప్రతినిధులు,అధికారులు,రైతులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube